National Turmeric Board | పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు కృషి

పసుపు రైతుల ఆర్థికాభివృద్ధి, వారి ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించడమే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు కృషి చేస్తోందని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్​: National Turmeric Board | పసుపు రైతుల ఆర్థికాభివృద్ధి, వారి ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించడమే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు కృషి చేస్తోందని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్​ (Armoor)లోని మామిడిపల్లిలో రైతులకు బాయిలర్, పాలిషర్ యంత్రాలను రైతులకు పంపిణీ చేశారు.

National Turmeric Board | సాగులో ఆధునికి సాంకేతికత..

ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి గారు మాట్లాడుతూ.. పసుపు సాగుకు ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి జాతీయ పసుపు బోర్డు కట్టుబడి ఉందన్నారు. ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పసుపు ఉడకబెట్టడం, పాలిషింగ్ ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. తద్వారా ఉత్పత్తి నాణ్యత పెరిగి మార్కెట్‌లో రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, పసుపు సాగు అభివృద్ధి, నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు జాతీయ పసుపు బోర్డు నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల పనితీరు, వాటి వినియోగంపై అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు సెక్రటరీ శ్రీమతి భవానీ, డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ రాజమాణిక్యం, రాణి, జవహర్, జాతీయ పసుపు బోర్డు కార్యాలయ అధికారులు, యంత్రాల లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Cold Weather in Nizamabad | గజగజ వణికిస్తోన్న చలి.. సాయంత్రమైతే ముసుగేయాల్సిందే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *