Indiramma Towers | నిజామాబాద్​లో ఇందిరమ్మ టవర్స్​.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

హైదరాబాద్​ తరహాలో నిజామాబాద్​లో సైతం పేదల కోసం ఇందిరమ్మ టవర్స్​ నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Towers | మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం నిజామాబాద్​ (Nizamabad) నగరంలో పర్యటించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పలు కాలనీల్లో మార్నింగ్​ వాక్​ చేశారు. ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లును పరిశీలించి, లబ్దిదారులతో మాట్లాడారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాల జీవితాల్లో తీసుకొస్తున్న మార్పును ప్రత్యక్షంగా చూడటం ఒక గొప్ప అనుభూతి అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. హైదరాబాద్ తరహాలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్​ను రాష్ట్రంలోని ఇతర పట్టణాలలో కూడ నిర్మించేలా నిజామాబాద్ నుండి శ్రీకారం చుడుతామని మంత్రి ప్రకటించారు. దీని కోసం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హౌసింగ్ శాఖకు సంబంధించిన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు.

Indiramma Towers | 8 లక్షల ఇళ్లు..

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రెండు విడతలు, హైదరాబాద్లో ఇచ్చే మొదటి విడత ఇండ్లతో కలిసి 8 లక్షల ఇండ్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. 2 లక్షల ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు కూడా జరిగాయన్నారు. అనంతరం మంత్రి నిజామాబాద్ నగరంలో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిర్మించిన డబుల్ ఇళ్లను పరిశీలించారు. ఆ ఇళ్లలో పనులు పూర్తి చేసి, అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేసి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: PDSU Leaders Arrest | విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *