PDSU Leaders Arrest | విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్​

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PDSU Leaders Arrest | జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి (Ponguleti Srinivas Reddy) శనివారం పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీస్​ యంత్రాంగం అప్రమత్తమైంది.

PDSU Leaders Arrest | పీడీఎస్​యూ నాయకులను..

మంత్రి పర్యటనను విద్యార్థి సంఘాలు అడ్డుకునే అవకాశాలున్నాయని పేర్కొంటూ పోలీసులు పలువురు నాయకులను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్​ను అదుపులోకి తీసుకున్నారు. పీడీఎస్​యూ (PDSU) జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే అషూర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని పరిష్కరించకుండా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Ganja Seizure | సాయి షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో 24.3 కిలోల గంజాయి పట్టివేత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *