అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rains | రాష్ట్రంలో గత నాలుగు రోజులు వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అల్ప పీడన ప్రభావంతో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ (Telangana)లో శనివారం సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, అర్ధరాత్రి వేళ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.
Heavy Rains | అల్ప పీడన ప్రభావంతో..
అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కాగా ఈ వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదు అయింది. సాధారణ వర్షపాతం 505.2 మి.మీ. కాగా.. ఆగస్టు 21 వరకు 432.6మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. 14 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. అయితే మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి.
ఇది కూడా చదవండి..: Yadadri Pharma Accident | యాదాద్రి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు..ఇద్దరు కార్మికుల దుర్మరణం..10 మందికి గాయాలు