అక్షరటుడే, వెబ్డెస్క్: Malkajgiri Police Meeting | హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ మేరకు మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి అధ్యక్షతన మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Malkajgiri Police Meeting | మాదకద్రవ్యాల నియంత్రణ
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, మహిళలు–పిల్లల రక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సీసీటీవీ కెమెరాల విస్తృత ఏర్పాటు వంటి అంశాలపై అధికారులు సమీక్షించారు.
ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్, మున్సిపల్ శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజా భద్రత పెంపు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల్లో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
Malkajgiri Police Meeting | సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు..
ప్రాంతంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడంతో పాటు, ప్రజల భాగస్వామ్యంతో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మల్కాజ్గిరి అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా రెండు శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.