అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganjani Mafia Hyderabad | హైదరాబాద్ మహా నగరంలో మాదకద్రవ్యాల ముప్పు ఎంత తీవ్రంగా మారుతోందో ఫతేనగర్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ తల్లి, కొడుకును ఈగల్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Malkajgiri Police Meeting | మరింత భద్రత.. పరిశుభ్రతపై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ చర్యలు
Ganjani Mafia Hyderabad | 11 మంది సింగిల్ పేరెంట్స్ పిల్లలు
పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రమ్మ (78), ఆమె కుమారుడు అజయ్ ఇంటి వద్ద నుంచే గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 5 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను రూ.500కు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన 31 మందిలో 11 మంది సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. పరీక్షల్లో 29 మందికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. చిన్న వయసులోనే మాదకద్రవ్యాల బారిన పడుతున్న పరిస్థితి తల్లిదండ్రులు, సమాజం ముందున్న తీవ్రమైన సవాల్‌గా మారింది.

Ganjani Mafia Hyderabad | సరైన పర్యవేక్షణ లేకపోవడం..
చదువుకోవాల్సిన వయసులో కొందరు చిన్నారులు మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కావడం వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, సరైన పర్యవేక్షణ లేకపోవడం, మత్తు పదార్థాలు సులభంగా అందుబాటులోకి రావడం వంటి అంశాలు పిల్లలను ప్రమాదంలోకి నెడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
చిన్నారులకు గంజాయి వంటి మత్తు పదార్థాలు చేరకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పాఠశాలలు, తల్లిదండ్రులు, సమాజం కలిసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ దర్యాప్తు కొనసాగిస్తుండగా, చిన్నారులను లక్ష్యంగా చేసుకునే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.