అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Business Fraud | తెలిసిన వారి నుంచి రూ.50 కోట్లు అప్పు చేసి పరారు అయ్యాడో వ్యాపారి. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది. ఆధిక వడ్డీలు ఇస్తానని ఆశచూపి డబ్బులు తీసుకున్న సిమెంట్ వ్యాపారి పారిపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చక్రపురం, భగవాన్ కాలనీకి చెందిన పబ్బ చంద్రశేఖర్ శ్రీవెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన 30 ఏళ్లుగా ఇక్కడ ఉండటంతో చాలా మందితో పరిచయం అయింది. చంద్రశేఖర్ చిట్టీలు సైతం వేసేవాడు. వ్యక్తిగత, వ్యాపారపరమైన అత్యవసర అవసరాల పేరుతో సుమారు 60 మంది నుండి రూ.50 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నాడు. అయితే ఆయన జూన్ 22 నుండి తన భార్యతో సహా అదృశ్యమయ్యారు.
Hyderabad Business Fraud | పోలీసులకు ఫిర్యాదు
తన కుమార్తె వివాహం, తండ్రి వైద్య చికిత్స, ఇంటి నిర్మాణం, జీఎస్టీ (GST) చెల్లింపులు, సిమెంట్ వ్యాపార పథకాలు, ఇతర అవసరాల కోసం ఆయన డబ్బు తీసుకున్నారని (Hyderabad Business Fraud) బాధితులు తెలిపారు. త్వరగా తిరిగి చెల్లిస్తానని, అధిక వడ్డీ ఇస్తానని హామీ ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బును తిరిగి ఇప్పించాలని, ఆ దంపతుల ఆచూకీ కనుగొని విచారణ జరపాలని కోరుతూ బాధితులు ఇప్పుడు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతిని ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మౌలాలికి చెందిన ఓ బాధితుడు మాట్లాడుతూ.. సదరు వ్యాపారి 15 ఏళ్లుగా తన షాపునకు వస్తారన్నారు. ఆయన అప్పు అడిగితే తన కూతురు ఇల్లు అమ్మి రూ.50 లక్షలు ఇచ్చానన్నారు. తన డబ్బులు ఇప్పించాలని వేడుకున్నాడు. మరో బాధితుడు మాట్లాడుతూ చంద్రశేఖర్ దగ్గర చిట్టీ వేశానన్నారు. ఆ డబ్బులు ఇస్తా ఇస్తా అనుకుంటూ పరారు అయ్యాడన్నారు. తనకు రూ.16 లక్షలు రావాలని వాపోయాడు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy Remarks | రాష్ట్రంలో తాగుడు కల్చర్ తెచ్చిన కేసీఆర్ : సీఎం రేవంత్రెడ్డి