Heavy Rain Alert | నేడు పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి కుండపోత వానలు కురుస్తాయని పేర్కొన్నారు.

ఆదిలాబాద్​, కుమురం భీమ్​ ఆసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్ (Nizamabad)​, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్​, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడుతాయి. సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్​, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వాతావరణం పొడిగా ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయి.

Heavy Rain Alert | రైతుల హర్షం

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్​ ప్రారంభం అయిన తర్వాత తొలిసారి భారీ వర్షం కురిసిందని రైతులు పేర్కొంటున్నారు. అయితే ఈ వాన అంతటా పడలేదు. అంతర్గాంలో 77.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. రామగుండంలో 65.3, బెల్లంపల్లి 54, కడ్డం పెద్దూరు 48.3, మల్యాల 47.5, ఇచ్చోడ 47, చేగుంట 41.8, మర్కూక్ 39.3, తాడిచెర్ల 37, అశ్వారావుపేటలో 35 మి.మీ. వర్షం కురిసింది.

దీనిని కూడా  చదవండి : Yadagirigutta Temple Board | యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు చోటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *