Yadagirigutta Temple Board | యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు చోటు

మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే వినోద్‌తో పాటు పలువురికి కూడా పాలక మండలిలో స్థానం దక్కింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yadagirigutta Temple Board | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం బోర్డు చైర్మన్‌గా సత్యనారాయణరెడ్డిని నియమించగా, మొత్తం 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేసింది.

Telangana Telugu History | ఆంధ్రుల భాష ‘ఆంధ్రం’… మనది ‘జాన తెలుగు’!: “ఇడుపు కాయితం” Title లొల్లి వేళ ఆకట్టుకుంటున్న ప్రొఫెసర్ దంటు కనకదుర్గ విశ్లేషణ

Yadagirigutta Temple Board | మంత్రి కొండా సురేఖ

ఈ కొత్త బోర్డులో సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడం విశేషంగా నిలిచింది. అలాగే మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే వినోద్‌తో పాటు పలువురికి కూడా పాలక మండలిలో స్థానం దక్కింది.

యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి, ఆలయ పరిపాలన, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవస్థానం నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ పాలక మండలి తీసుకోనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో కొత్త బోర్డు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడైంది.

HMEwnmOaoAE0hRF

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *