Young India School | యంగ్ ఇండియా స్కూల్​ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ/బోధన్​: Young India School | యంగ్ ఇండియా స్కూల్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన పూర్తయినందున త్వరలోనే శంకుస్థాపన చేసి నిర్మాణాలను ప్రారంభిస్తామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. బోధన్ (Bodhan) పట్టణ శివారులోని బెల్లాల్ ప్రాంతంలో ఎంపిక చేసిన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు.

Young India School | త్వరగా శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలి

ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల నిర్మాణానికి స్థలాన్ని ఖరారు చేసినందున.. శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. త్వరలోనే పనులు ప్రారంభించి, నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

Young India School | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ భవన నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్​ తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను (Integrated Residential Schools) ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందన్నారు. ఇందులో భాగంగానే బోధన్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈ రాందాస్, తహశీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Extra Marital Affair | భర్త అక్రమ సంబంధం.. ఆగ్రహంతో దేహశుద్ధి చేసిన భార్య !

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *