Extra Marital Affair | భర్త అక్రమ సంబంధం.. ఆగ్రహంతో దేహశుద్ధి చేసిన భార్య !

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్: Extra Marital Affair | జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీ (Giriraj College) రోడ్డులో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఒక ఇల్లాలు నడిరోడ్డుపై ఆందోళనకు దిగింది.

Extra Marital Affair | వివాహేతర సంబంధం :

బాధిత మహిళ సంధ్య కథనం ప్రకారం.. ఆమె భర్త శ్రవణ్ కుమార్, గుత్ప గ్రామానికి చెందిన శివ రంజని అనే మహిళతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి షాపింగ్ ముగించుకుని వస్తుండగా సంధ్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె, భర్తతో పాటు అతని ప్రియురాలికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. పోలీసులు వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Extra Marital Affair | ప్రియురాలి ఇంటి ముందు ఆందోళన :

శ్రవణ్ తన ప్రియురాలితో కలిసి దుబ్బ రోడ్డులో కాపురం ఉంటున్నాడన్న సమాచారంతో, సంధ్య వారి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ అక్కడికి చేరుకున్న పోలీసుల కాళ్లను పట్టుకుని బాధితురాలు కన్నీరుమున్నీరైంది.

Extra Marital Affair | మరో మలుపు:

ఈ గొడవ జరుగుతున్న సమయంలో శివ రంజని భర్త శ్రీధర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రవణ్ కుమార్ తన ప్రియురాలి భర్త శ్రీధర్‌పైనే దాడికి పాల్పడటం గమనార్హం. బాధితుడు శ్రీధర్ కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరి భార్య, మరొకరి భర్త ఎదురెదురుగా వచ్చి గొడవకు దిగడంతో గిరిరాజ్ కాలేజీ రోడ్డు ప్రాంతం కాసేపు ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: BJP Strategy | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి : ఎమ్మెల్యే కేవీఆర్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *