BJP Strategy | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి : ఎమ్మెల్యే కేవీఆర్

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి: BJP Strategy | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC and ZPTC Elections) ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్​లో (Raja Reddy Garden) శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని మండల, గ్రామ, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.

BJP Strategy | బూత్​స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ బలోపేతం అయినప్పుడే అన్ని ఎన్నికల్లో గెలవగలమని తెలిపారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ఈ ఎన్నికల్లో అందరు పోటీ చేసి గెలిచి కార్యకర్తలు నాయకులుగా అయ్యే అవకాశం ఉందన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో అవినీతి రహిత కామారెడ్డి (Kamareddy) కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, దానికోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయటానికైనా తాను సిద్దమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుకు ఉద్యమం చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bear Attack | ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు.. రెడ్డిపేట స్కూల్ తండాలో ఘటన

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *