IAS IPS transfers | త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్​ల బదిలీలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS IPS transfers | రాష్ట్రంలో త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులను (IAS IPS transfers) బదిలీ చేయనున్నట్లు సమాచారం. పలువురు అధికారుల పనితీరుపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. దీంతో కీలక స్థానాల్లో ఉన్న వారికి స్థానచలనం కలిగించనున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్న పలువురు అధికారులపై సీఎం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారిని ట్రాన్స్​ఫర్​ చేయనున్నట్లు సమాచారం. అలాగే నూతన డీజీపీ (DGP) నియామకం తర్వాత ఐపీఎస్​ల బదిలీలు సైతం చేపట్టనున్నారు.

IAS IPS transfers | డీజీపీగా సీవీ ఆనంద్

సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ (CV Anand)ను తెలంగాణ కొత్త డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత డీజీపీ శివధర్​రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త డీజీపీగా సీవీ ఆనంద్​ను నియమించనున్నట్లు సమాచారం. ఆమోదం లభిస్తే ఆయన మే 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. తదనంతరం పలు జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్​ల సీపీలు మారే అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఆరుగురికి డీజీపీ హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సీనియర్ IPS అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాకు (స్థాయి 16 / HAG+) ఎంపిక చేస్తూ, పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో వీరిశెట్టి వెంకట శ్రీనివాస రావు (1995), స్వాతి లక్రా (1995), మహేష్ మురళీధర్ భగవత్ (1995), చారు సిన్హా (1996), అనిల్ కుమార్ (1996), V.C. సజ్జనార్ (1996) ఉన్నారు. త్వరలో జరుగనున్న బదిలీల్లో వీరికి కీలక స్థానాలు అప్పగించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Cooperative Societies | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సహకార సంఘాలకు నామినేటెడ్​ పాలకమండళ్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *