RTC Driver | మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Driver | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. భద్రాచలం (Badrachalam) ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న డి.లింగారెడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి కార్మికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికి ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేశారు.

కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కోరారు. కేబినెట్​ మీటింగ్​లో ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. కేబినెట్​ మీటింగ్​ అనంతరం మంత్రులు మీడియాకు వివరాలు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎలా పరిష్కరించాలో కేబినెట్‌లో చర్చించామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ రూ.6 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని, 100 రోజుల్లో ఈ బెనిఫిట్స్‌ను ఎలా క్లియర్‌ చేయాలో ప్రణాళిక తయారు చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో రేపటి నుంచి మంత్రుల బృందం చర్చిస్తుందని పేర్కొన్నారు.

RTC Driver | ప్రాణాలు తీసుకోవద్దు

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. క్షణికావేశంలో కుటుంబాలకు అన్యాయం చేయవద్దన్నారు. కార్మిక సంఘాలు చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులు అన్నారు.

దీనిని కూడా చదవండి : RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్​ వాహనాల దోపిడీ

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *