హైదరాబాద్RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్​ వాహనాల దోపిడీ

RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్​ వాహనాల దోపిడీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC Strike Issues | ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC Workers Strike) రెండో రోజు కొనసాగుతోంది. అరకొరగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెను ఆసరాగా చేసుకొని ఆటో డ్రైవర్లు, ఇతర ప్రైవేట్​ వాహనదారులు ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. సమ్మెను విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar) కోరినా.. కార్మికులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులు, ప్రైవేట్​ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. కొన్ని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి.

RTC Strike Issues | పోలీసు బందోబస్తు మధ్య..

ఆర్టీసీ డిపో నుంచి బస్సులను పోలీస్​ బందోబస్తు మధ్య బయటకు తీసుకు వస్తున్నారు. అయితే బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. జనగామ జిల్లా (Jangaon District) కేంద్రంలో తమ సమ్మెను అడ్డుకోవద్దని ఓ ఆర్టీసీ కార్మికుడు పోలీసుల కాళ్లు మొక్కాడు. మహబూబాబాద్, తొర్రూరు డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విధులకు రాని 21 మంది కార్మికులపై కేసు నమోదు చేశారు. సమ్మెలో పాల్గొనేందుకు డిపో వద్దకు వస్తున్న కార్మికులను అరెస్టు చేశారు. సూర్యాపేట డిపో ఎదుట పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

RTC Strike Issues | మెట్రోకు పోటెత్తిన ప్రయాణికులు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో మెట్రోకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రజలు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వాళ్లు సాధారణ రోజుల్లో కంటే అధికంగా వసూలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: RTC JAC protest | బస్సుల అడ్డగింత.. మహిళా కండక్టర్ల బైఠాయింపు!

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల బీభత్సం.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దోపిడీ దొంగలు బీభత్సం...

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...