అక్షరటుడే, వెబ్డెస్క్: RTC JAC protest | తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మెను ఉద్ధృతం చేసింది. ఈ రోజు (గురువారం) ఉదయం 5 గంటలకే అన్ని డిపోల ఎదుటకు చేరుకున్నారు. మహా ధర్నాలు చేపట్టారు.
RTC JAC protest | పోరాటస్ఫూర్తి
సమ్మె మొదటి రోజు కార్మికులు ఐక్యత చాటారు. రెండోరోజు పోరాటస్ఫూర్తి చూపారు. చర్చల పేరుతో కార్మికులు, ప్రజలను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. సమస్యలను పరిష్కరించలేమని అధికార కమిటీ చేతులెత్తేసిందని జేఏసీ నేతలు ఆరోపించారు.
RTC JAC protest | డిపోల నుంచి బయటకు రాకుండా..
నిజామాబాద్ రెండో డిపో నుంచి తెల్లవారుజామున ఆర్టీసీ బస్సులను బయటకు తీస్తుండగా.. మహిళా కండక్టర్లు అక్కడికి చేరుకున్నారు. డిపోనకు అడ్డంగా బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలి..
కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021 వేతన సవరణను కనీసం 30 శాతం తగ్గకుండా అమలు చేయడం ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయాలని కూడా జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా, ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులను సైతం వెంటనే వెనక్కి తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. కార్మిక సంఘాలను పునరుద్ధరించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం