అక్షరటుడే, వెబ్‌డెస్క్: Akun Sabharwal | ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ తిరిగి తెలంగాణ సర్వీస్‌కు వచ్చారు. ఇన్ని రోజులు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లిన ఆయన తాజాగా సర్వీస్ పూర్తి చేసుకొని తెలంగాణకు వచ్చారు.
అకున్ సభర్వాల్ 2001 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో తెలంగాణ (Telangana)లో ఆయన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఆయన దర్యాప్తు చేశారు. ఈ కేసులో అనేక మంది టాలీవుడ్ నటులు పేర్లు బయటకు వచ్చాయి. అనంతరం ఈ కేసు పక్కకు వెళ్లిపోయింది. 2023లో అకున్ సభర్వాల్ కేంద్ర హోంశాఖలోకి వెళ్లారు.
Akun Sabharwal | డ్రగ్స్ కేసుపై ఉత్కంఠ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు రిపోర్టు బయటకు రాలేదు. ఈ కేసులో అకున్ సభర్వాల్ దూకుడుగా వెళ్లారు. అయితే ప్రభుత్వం నుంచి అతడికి సహకారం అందలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు ఉండటంతో.. పెద్దల ఒత్తిడి ఆ కేసును పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసుతో పలువురు రాజకీయ నేతలకు సైతం సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అకున్ సభర్వాల్ మళ్లీ తెలంగాణకు రావడంతో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ కేసును మళ్లీ బయటకు తీస్తుందా.. లేకపోతే ఆయనకు ఇతర బాధ్యతలు అప్పగిస్తుందా అనేది చూడాలి. కాగా ఆయన భార్య ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చెవికి సంబంధించిన వైద్య చికిత్స కోసం సెలవులో ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Dasara Special Trains | దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు