అక్షరటుడే వెబ్‌డెస్క్: HYDRAA Commissioner | తనకు నెల రోజుల జైలు శిక్ష పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ ( Hyderabad )హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. ఆ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అందులో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టు తనకు నెల రోజుల జైలు శిక్ష విధించిందంటూ నెట్టింట వైరల్ అవుతున్న పోస్టులను ఆయన ఖండించారు. తాను ఊహించినట్లుగానే కొందరు కావాలనే సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఏవీ రంగనాథ్ ఆరోపించారు. ఇవన్నీ కేవలం అసత్య ప్రచారాలు మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు.
HYDRAA Commissioner | అధికారిక సమాచారమే నమ్మండి..
సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్‌లను ప్రజలు, మీడియా ప్రతినిధులు ఎవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా అంశానికి సంబంధించి కేవలం అధికారిక మూలాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
ఇది కూడా చదవండి: Ankit Sharma Murder | ఐబీ అధికారి హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడికి యావజ్జీవ కారాగార శిక్ష