అక్షరటుడే, గాంధారి: Mobile Phone Blast | పిడుగుపాటుకు రెండు మొబైల్ ఫోన్లు పేలిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి(Gandhari) మండలంలో చోటు చేసుకుంది.
Mobile Phone Blast | గొడుగు పట్టుకుని పొలానికి వెళ్తుండగా..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని బొబ్బజివాడి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు మేకల సూర్యకాంత్, శంకర్లు గొడుగు పట్టుకొని పొలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడగా వారిద్దరి జేబుల్లోని సెల్ఫోన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ సురేష్, పైలెట్లు క్షతగాత్రులని గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: రియాద్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుడు