Ukraine Russia Drone Attack | మాస్కో టార్గెట్‌గా ఉక్రెయిన్ దాడి.. 1000 డ్రోన్లతో రష్యాలో బీభత్సం..!

రష్యాపై ఉక్రెయిన్ ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ukraine Russia Drone Attack | రష్యాపై ఉక్రెయిన్ ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యాలో జరుగుతున్న పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున ఏకంగా వెయ్యికి పైగా డ్రోన్లతో రాజధాని మాస్కోను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ భారీ దాడి కారణంగా మాస్కోలోని ఓ చమురు శుద్ధి కర్మాగారం తీవ్రంగా దెబ్బతిని, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

శనివారం రాత్రి జరిగిన ఈ దాడి రష్యాను గట్టిగా దెబ్బతీసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ధృవీకరించారు. రష్యాకు చెందిన చమురు ఉత్పత్తి కేంద్రం, ఒక లాజిస్టిక్ కేంద్రాన్ని టార్గెట్ చేసుకునే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి ఈ లాజిస్టిక్ కేంద్రాలే ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక దాడిలో FP-1, RZ-100, MICH-2000, పాలియానిట్సియా, వెండెట్టా, లియుటి, బార్స్, ఫ్లెమింగో, సిచెన్, పెలికాన్ వంటి అధునాతన డ్రోన్ వ్యవస్థలను వినియోగించినట్లు సమాచారం.

Ukraine Russia Drone Attack | జెలెన్స్కీ హితవు..

ఇకనైనా యుద్ధాన్ని ముగించేందుకు రష్యా శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని జెలెన్స్కీ హితవు పలికారు. ఇంధనం, ఆహార భద్రత రంగాలలో ఉద్రిక్తతలను తగ్గించడానికి తగిన మార్గాలు ఉన్నాయని, దీనికి కేవలం రాజకీయ సంకల్పం మాత్రమే అవసరమని ఆయన పేర్కొన్నారు.

Ukraine Russia Drone Attack | ఎన్నికల వేళ కలకలం..

రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్నికలను ఉక్రెయిన్‌పై పుతిన్ సాగిస్తున్న యుద్ధానికి ఒక ప్రజా పరీక్షగా అభివర్ణిస్తున్నారు. అయితే రష్యాలో జరుగుతున్న ఈ ఎన్నికలను ఉక్రెయిన్ పూర్తిగా తిరస్కరించింది. మరోవైపు, ఈ దాడులకు ఉక్రెయినే కారణమని మాస్కో ఆరోపించింది. అంతేకాకుండా, ఎన్నికల సమయంలో ఆన్‌లైన్ ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు సైబర్ దాడుల ప్రయత్నాలు జరిగినట్లు రష్యా ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Mobile Phone Blast | పిడుగుపాటుకు పేలిన రెండు మొబైల్ ఫోన్లు.. తప్పిన ప్రమాదం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *