అక్షరటుడే వెబ్‌డెస్క్: Dowleswaram Barrage | రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం, చారిత్రాత్మక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులను వేగవంతం చేసింది. సోమవారం (జులై 13, 2026) జరిగిన తన మూడు జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu Naidu ) నాయుడు ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకుని, కొత్త గేట్ల నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
Dowleswaram Barrage | పనుల వివరాలు , వ్యయం..
సుమారు రూ. 152.95 కోట్లతో ఈ ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. సీడబ్ల్యూసీ (CWC) సూచనల మేరకు, బ్యారేజీలోని 117 పాత వరద గేట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త గేట్లను అమర్చే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో 58 గేట్లకు మరమ్మతులు చేపట్టగా, ఇప్పుడు మిగిలిన 117 గేట్ల మార్పిడితో బ్యారేజీని పూర్తిస్థాయిలో పటిష్టం చేస్తున్నారు.
Dowleswaram Barrage | అధికారులకు సీఎం ఆదేశాలు..
బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన చంద్రబాబు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తి చేసి బ్యారేజీని సిద్ధంగా ఉంచుతామని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Singareni Bharosa Yatra | గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారీ బొగ్గు కుంభకోణం: కిషన్ రెడ్డి