Paddy Procurement Kamareddy | తహశీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్​..

నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Paddy Procurement Kamareddy | నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భిక్కనూర్(Bhikkanoor)​ తహశీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.

Paddy Procurement Kamareddy | భిక్కనూరు తహశీల్దార్​ కార్యాలయంలో..

తాజాగా భిక్కనూర్ తహశీల్దార్​ కార్యాలయంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్​తో వాగ్వాదానికి దిగారు. లారీలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి. ఏ కేంద్రంలో పూర్తిస్థాయిలో ధాన్యం(Paddy Procurement) తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ రైతులకు నచ్చజెప్పినా వినకపోవడంతో అడిషనల్ కలెక్టర్​తో(Additional Collector) ఫోన్​లో మాట్లాడారు. రైతుల ధాన్యం 48 గంటల్లో తరలించే ఏర్పాట్లు చేస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం తహశీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

thahasil

 

ఇది కూడా చదవండి: Nizamabad Medical College | మెడికల్​ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కలకలం రేపిన ఘటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *