అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Comments | కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భేటీ వెనుక ఉన్న రహస్యాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ( Harish Rao )డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Harish Rao Comments | హరీశ్ రావు ప్రశ్నలు..
అధికారులను ఎందుకు దూరం పెట్టారు?: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అలాగే రాష్ట్ర ఇంజనీర్లను, ఈఎన్‌సీని గది బయటే కూర్చోబెట్టి… ముగ్గురు సీఎంలు గంటల తరబడి ఏం మాట్లాడుకున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇంతటి గోప్యత అవసరమా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీని ‘చారిత్రక ఒప్పందం’ అని పిలుస్తున్నారని, ఆ ఒప్పందంలో ఏముందో, దాని వల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనమేంటో అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.

Harish Rao Comments | ప్రభుత్వంపై ఘాటు విమర్శలు..
నదీ జలాల విషయంలో కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి అజ్ఞానం, తెలంగాణకు మరణ శాసనంగా మారుతోందని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేళ్లలో 383 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు సాధిస్తే.. ఈ ప్రభుత్వం కనీసం ఒక్క టీఎంసీకి కూడా అనుమతి సాధించలేదని ఎద్దేవా చేశారు. “నువ్వు గుంపు మేస్త్రివి అయినా మాకు అభ్యంతరం లేదు.. కానీ తెలంగాణను ముంచే ‘ముంపు మేస్త్రి’ కావొద్దు” అంటూ రేవంత్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు.
Harish Rao Comments | డిమాండ్లు..
నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా జరుగుతున్న ఒప్పందాలపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. చంద్రబాబు పలుకుబడితో కేంద్ర ఇరిగేషన్ అధికారిగా ఏపీ వ్యక్తిని నియమించుకున్నారని, దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. “పోరాడి సాధించుకున్న తెలంగాణను ఏపీ, కర్ణాటక ప్రాజెక్టుల అక్రమ కట్టడాలతో ముంచుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి వారితో కలిసి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు” అని హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
‘తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి’ – మాజీ మంత్రి హరీశ్‌రావు
T. Harish Rao urged the governments to make public the details of the discussions held between the Chief Ministers of Telangana, Andhra Pradesh, and Karnataka.… pic.twitter.com/j50vr3WMmP
— Akshara Today | Telugu News (@aksharatoday) June 27, 2026
ఇది కూడా చదవండి: Flat Possession Compensation | ఇల్లు అప్పగింత జాప్యానికి పరిహారం కోరే హక్కు ఉంది: సుప్రీంకోర్టు