జాతీయంNEET Exam Scam | ఢిల్లీలో 'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసనకు పిలుపు.. కేంద్ర మంత్రి...

NEET Exam Scam | ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనకు పిలుపు.. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పరీక్షల అవకతవకలు, వరుస వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Exam Scam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పరీక్షల అవకతవకలు, వరుస వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా జూన్ 6వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే ప్రకటించారు.

NEET Exam Scam | వీడియోను రిలీజ్ చేస్తూ..

సోమవారం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను రిలీజ్ చేస్తూ ఈ వివరాలను వెల్లడించారు. విద్యార్థులు, దేశ యువత అంతా రాజ్యాంగబద్ధంగా, ప్రశాంతమైన మార్గంలో ఒకతాటిపైకి వచ్చి గళం విప్పితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగివస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
cocroj.1

 

NEET Exam Scam | జూన్ 6 యాక్షన్ ప్లాన్..

ఈ నిరసన కార్యక్రమం కోసం జూన్ 6వ తేదీ (శనివారం) ఉదయమే అభిజీత్ డిప్కే ఢిల్లీకి రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. విమానాశ్రయం నుండి అందరూ కలిసి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటారని.. అక్కడ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు పోలీసుల నుండి అధికారికంగా అనుమతి కోరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుండటం విశేషం.
NEET Exam Scam

 

 

ఇది కూడా చదవండి: Agniveer Selection | అగ్నివీర్‌కు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి 8 మంది ఎంపిక

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...