అక్షరటుడే వెబ్‌డెస్క్: Tata AIA Fortune Guarantee | తన వినియోగదారులకు అత్యుత్తమ ఆర్థిక భద్రత, పొదుపు ప్రయోజనాలను అందించేందుకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (Tata AIA Life Insurance) ఒక సంచలనాత్మక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థకు చెందిన ఫ్లాగ్‌షిప్ ప్లాన్ ‘టాటా ఏఐఏ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీమ్’ (Tata AIA Fortune Guarantee Supreme) లో ‘హై లైఫ్ కవర్ ఎండోమెంట్ ఆప్షన్’ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పాలసీదారులకు మొదటి రోజు నుంచే వార్షిక ప్రీమియం కంటే 30 రెట్లు అధికంగా లైఫ్ కవర్ (జీవిత భీమా) లభించడంతో పాటు, మెచ్యూరిటీ సమయంలో గ్యారంటీడ్ లంప్‌సమ్ మొత్తం దక్కుతుంది.
Tata AIA Fortune Guarantee | ఆర్థిక భద్రత..
భారతీయ ( India ) కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించినట్లు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శృతి ఓకే తెలిపారు. కుటుంబ భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా, ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి రోజు నుంచే భారీ భద్రతను అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. భవిష్యత్ లక్ష్యాల కోసం పక్కా ప్రణాళికతో డిపాజిట్ చేస్తూనే, కుటుంబానికి మెరుగైన రక్షణ గోడగా నిలవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు.
Tata AIA Fortune Guarantee | ఫార్చ్యూన్ గ్యారంటీ ..
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టిన ‘ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీమ్’ ప్లాన్ ద్వారా పాలసీ ప్రారంభమైన మొదటి రోజు నుంచే వార్షిక ప్రీమియం కంటే 30 రెట్ల భారీ లైఫ్ కవరేజ్ అందుతుంది. పాలసీ గడువు పూర్తయిన తర్వాత ఎలాంటి రిస్క్ లేకుండా నిశ్చితమైన గ్యారంటీడ్ లంప్‌సమ్ నగదు రూపంలో మెచ్యూరిటీ బెనిఫిట్ లభిస్తుంది. ఈ పాలసీలో భాగంగా కస్టమర్లు తమ ఆర్థిక స్థోమతను బట్టి 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటును పొందవచ్చు. అర్హత , వయస్సును బట్టి 20 ఏళ్ల నుంచి గరిష్టంగా 50 ఏళ్ల వరకు పాలసీ టర్మ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
ఈ పాలసీలో వయోపరిమితి చాలా వెసులుబాటుగా ఉంది; కేవలం 30 రోజుల చిన్న పిల్లల నుంచి ప్రారంభించి, 100 సంవత్సరాల మెచ్యూరిటీ వయస్సు ఉన్నవారి వరకు ఎవరైనా దీనిని తీసుకోవడానికి అర్హులు. సంవత్సరానికి కనీసం రూ. 24,000 ప్రీమియంతో ఈ ప్లాన్‌ను ప్రారంభించవచ్చు కాగా, గరిష్ట ప్రీమియంపై ఎలాంటి పరిమితి లేదు. అలాగే, పాలసీదారుని ఎంట్రీ ఏజ్, ప్రీమియం , పాలసీ టర్మ్ ఆధారంగా సుమారు 7.06% వరకు ఆకర్షణీయమైన ఐఆర్‌ఆర్ (IRR) రాబడిని కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.
Tata AIA Fortune Guarantee | రైడర్లతో 40 రెట్లకు..
ఈ పాలసీతో పాటు అదనపు భద్రత కోసం పలు రైడర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ‘బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్’ ద్వారా పాలసీదారునికి ఏదైనా జరిగినా లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురైనా, భవిష్యత్ ప్రీమియంలను రద్దు చేస్తారు. అయినప్పటికీ పాలసీకి వచ్చే బెనిఫిట్స్ యథావిధిగా కొనసాగుతాయి. అదేవిధంగా, ‘టర్మినల్ ఇల్ నెస్ విత్ టర్మ్ బూస్టర్’ రైడర్ ద్వారా మొత్తం లైఫ్ కవరేజ్‌ను వార్షిక ప్రీమియంపై ఏకంగా 40 రెట్లకు పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ఇది కూడా చదవండి: Alumni Reunion | ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుక