అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crude Oil Prices | అమెరికా -ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై యూఎస్, ఇరాన్‌ల మధ్య ప్రతీకార దాడులు జరుగుతుండడడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు వంద డాలర్ల దిశగా పయనిస్తున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
Crude Oil Prices | ద్రవ్యోల్బణ భయాలు..
క్రూడ్ ఆయిల్ (Crude oil) ధరలు పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణం అదుపుతప్పే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో హెవీవెయిట్ ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువై దేశీయ స్టాక్ మార్కెట్‌లో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం నష్టాల బాటలో సాగుతున్నాయి.
Crude Oil Prices | నష్టాలతో మొదలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 69 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 31 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 409 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 7 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 133 పాయిట్లు నష్టపోయింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 418 పాయింట్ల నష్టంతో 76,097 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల నష్టంతో 23,770 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 6 స్టాక్స్ లాభాలతో, 24 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. పవర్‌గ్రిడ్ 0.81 శాతం, మారుతి 0.55 శాతం, ఎల్టీ 0.33 శాతం, బీఈఎల్ 0.31 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.17 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 3.32 శాతం, టాటా స్టీల్ 2.14 శాతం, టెక్ మహీంద్రా 2.09 శాతం, ట్రెంట్ 2.08 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.78 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: SBI Recruitment 2026 | SBI అదిరిపోయే అప్‌డేట్.. 12 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు!