అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bourampet Car Fire | హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేటలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో సోమవారం ఉదయం ఓ కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధం అయింది. దీంతో కారులో ఉన్న వ్యక్తి బయటికి రాలేక సజీవ దహనం అయ్యాడు. మృతుడిని కార్తీక్ రాధాకృష్ణగా గుర్తించారు. బౌరంపేట ప్రణవ్ మేడోస్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.
Bourampet Car Fire | కేసు నమోదు
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా లేక ఇతర కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. కాగా రాధాకృష్ణ ఆర్థిక సమస్యలతో కారులో కూర్చొని నిప్పు అంటించుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Tukkuguda Nurse Murder | తుక్కుగూడ నర్సు హత్య ఘటనపై సీఎం సీరియస్.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం