Municipal Worker Protest | వాటర్​ ట్యాంక్​ ఎక్కి మున్సిపల్ కార్మికుడి నిరసన

నిజామాబాద్​ నగరంలో ఓ మున్సిపల్​ కార్మికుడు నిరసన తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Municipal Worker Protest | నిజామాబాద్​ (Nizamabad) నగరంలో ఓ మున్సిపల్​ కార్మికుడు నిరసన తెలిపారు. తమను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్పొరేషన్​లో వాటర్​ వర్క్స్​​ విభాగంలో పని చేస్తున్న యూసుఫ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం జోన్​ –2 కార్యాలయం గోల్​ హనుమాన్​ వాటర్​ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపాడు. తమను వేధిస్తున్న శానిటేషన్ అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వేతనాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఇది కూడా చదవండి..: 112 Call Saves Lives | 112 కాల్​తో తల్లీబిడ్డల ప్రాణాలు సేఫ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *