అక్షరటుడే, కామారెడ్డి: 112 Call Saves Lives | ఒక్క 112 కాల్తో పెను ప్రమాదం తప్పింది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై బిడ్డతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళను దోమకొండ పోలీసులు (Domakonda Police) సకాలంలో గుర్తించి కాపాడారు.
112 Call Saves Lives | భార్యభర్తల మధ్య గొడవ..
భార్యాభర్తల మధ్య గొడవ అనంతరం దోమకొండకు చెందిన మహిళ తన చిన్నారిని తీసుకుని వెళ్లిపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని భావించిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 112కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పెట్రోకార్ సిబ్బంది కానిస్టేబుల్ సాయిబాబా, హోంగార్డు రాజు అప్రమత్తమై గాలింపు చేపట్టారు. గుండ్ల చెరువు కట్ట సమీపంలోని దారిలో బిడ్డతో వెళ్తున్న మహిళను గుర్తించి సముదాయించారు. కౌన్సెలింగ్ ఇచ్చి ఆత్మస్థైర్యం నింపి సురక్షితంగా భర్త, అత్తకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎంరాజేష్ చంద్ర మాట్లాడుతూ ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఆపదలో ఉన్నవారు వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని, ప్రజల ప్రాణరక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Woman Attacked | వృద్ధురాలిపై దాడి చేసి చెవికమ్మలు చోరీ