Bonalu Celebrations | బోనం ఎత్తిన పోచారం.. వర్షాలు కురవాలని అమ్మవారికి పూజలు

ఆషాఢ మాసం సందర్భంగా పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలోని జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో బోనాల పండుగ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Bonalu Celebrations | ఆషాఢ మాసం సందర్భంగా పాత బాన్సువాడ(Banswada) సంగమేశ్వర కాలనీలోని జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో బోనాల పండుగ భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి(MLA Pocharam Srinivas Reddy), రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.

Bonalu Celebrations | ప్రత్యేక పూజలు

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి స్వయంగా బోనం ఎత్తుకుని భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పాడి పంటలతో పుష్కలంగా ఉండాలని ప్రార్థించారు. సందర్భంగా ఆషాఢ మాస బోనాల పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు పోచారం శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *