Mandal Congress Committees | నెలాఖరులోగా మండల కాంగ్రెస్​ కమిటీల నియామకం: పీసీసీ చీఫ్​

జిల్లాలో నెలాఖరులోగా మండల కాంగ్రెస్​ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Mandal Congress Committees | జిల్లాలో నెలాఖరులోగా మండల కాంగ్రెస్​ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు. ఈ మేరకు నగరంలోని దుబ్బలో ఉన్న ఎంకే గార్డెన్స్​లో ఉమ్మడి జిల్లా పొలిటికల్​ ఎఫైర్స్​ కమిటీ సమావేశం నిర్వహించారు.

Mandal Congress Committees | నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం

ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Seethakka) ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…గత పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలకు వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ఓటరు జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అధికంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బూత్​స్థాయి ఏజెంట్లు (BLAs) అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Mandal Congress Committees | డీసీసీ అధ్యక్షుడు చొరవ చూపాలి

2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటరు జాబితాల వివరాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీ చీఫ్​ పేర్కొన్నారు. సవరణ ప్రక్రియ సజావుగా జరగని ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

Mandal Congress Committees | పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త బాధ్యత అని బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ శెట్కర్, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ ఛైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Pocharam Srinivas Reddy | పోచారం మాకొద్దు.. బాన్సువాడ కాంగ్రెస్​ నాయకుల నినాదాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *