Nagesh Reddy Warning | పీసీసీ చీఫ్​పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. అనవసరంగా పీసీసీ చీఫ్​పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:  Nagesh Reddy Warning | రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని..అనవసరంగా పీసీసీ చీఫ్​పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Nagesh Reddy Warning | నీ చరిత్ర అందరికీ తెలుసు..

నగేష్​ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్​ ప్రజలకు రాకేష్​ రెడ్డి (Rakesh Reddy) చరిత్ర మొత్తం తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. పీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని రాకేష్​ రెడ్డికి హితవు పలికారు. ఆయన తాత ముత్తాతల కాలం నుండి భూస్వాములుగా ఉన్నారన్నారు. స్వయంగా వారే 12 ఎకరాలు దానం చేశారని తెలిపారు.

Nagesh Reddy Warning | రాజీనామా చేయాలి

రాకేష్​ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారని.. ఆయన వెంటనే రాజీమానా చేస్తా తాము కూడా సిద్ధంగా ఉన్నామని నగేష్​రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ ప్రజలే ఆయనను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తన సీటు కాపాడుకోవడానికి మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాకేష్​ రెడ్డి నీట్​ పరీక్ష గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్​ పార్టీ మాట తప్పదన్నారు.

Nagesh Reddy Warning | ఆర్మూర్​ జంబి హనుమాన్​ సాక్షిగా రాజీనామా చేయాలి..

అనంతరం గాంధీభవన్​ అధికార ప్రతినిధి ఏబీ చిన్నా మాట్లాడుతూ.. ఆర్మూర్ జంబి హనుమాన్ సాక్షిగా రాకేష్​రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ దందా చేస్తూ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మహేష్ కుమార్​ను విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. పీసీసీ చీఫ్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని.. దమ్ముంటే రాకేష్​ రెడ్డి రాజీనామా చేసి ప్రజల మధ్య నిలబడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Dharmapuri Arvind Students | గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు జాతీయస్థాయిలో గుర్తింపు.. అంతర్జాతీయ వేదికపైకి అడుగులు.. ఛాంపియన్లను అభినందించిన ఎంపీ ధర్మపురి అర్వింద్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *