Bandi Sanjay Mother | కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రికి తరలింపు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Sanjay Mother | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ (75) శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్న ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

Bandi Sanjay Mother | తీవ్ర మనస్తాపమే కారణమా?

గత కొద్ది రోజులుగా బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, నమోదైన కేసుల నేపథ్యంలో శకుంతలమ్మ తీవ్రంగా కలత చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

మనవడిపై వస్తున్న ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ట్రోలింగ్‌తో ఆమె గత మూడు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని సమాచారం.

Bandi Sanjay Mother | ఆసుపత్రిలో చికిత్స

గుండెపోటు రావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రికి చేర్చారు. వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.

తల్లి అస్వస్థత వార్త తెలిసిన వెంటనే బండి సంజయ్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. బిజెపి శ్రేణులు, పలువురు రాజకీయ ప్రముఖులు శకుంతలమ్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Revanth Reddy Bandi Sanjay | బండి సంజయ్ తన కొడుకును వెంటనే పోలీసులకు అప్పగించాలి: సీఎం రేవంత్ రెడ్డి

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *