BRS Formation Day | నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన తెలంగాణ భవన్

Naresh Chandan
BRS Formation Day

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BRS Formation Day | తెలంగాణ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ, 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు జరుపుతోంది.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్​ను వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను ఎగురవేయనున్నారు.brs 1

BRS Formation Day | ఎమ్మెల్యేలు, ఎంపీలు

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కూడా పార్టీ జెండాలను ఎగరవేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరుకానున్నారు.

BRS Formation Day  | కేసీఆర్ సమీక్ష

ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రస్థానం, తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్ర, ప్రభుత్వంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై కేసీఆర్ సమీక్షించనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన ఈ పార్టీ, అనంతరం రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి అధికారంలోకి వచ్చింది. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తన ముద్రను వేసుకుంది.

ఈ వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై కూడా ఆసక్తికర చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

April 27 Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్లు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *