అక్షరటుడే, సిరిసిల్ల: Gudepu Vamshika Cricket | ఎస్జీఎఫ్ జాతీయ క్రికెట్ క్రీడలకు (SGF National Cricket) ముస్తాబాద్ (Mustabad) మండలానికి చెందిన క్రీడాకారిణి గూడెపు వంశిక ఎంపికైంది. ఈ సందర్భంగా మండల ప్రజలు క్రీడాకారిణిని ఘనంగా సన్మానించారు.
Gudepu Vamshika Cricket | జమ్మూకశ్మీర్లో జాతీయ పోటీలు..
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన గూడెపు వంశిక జమ్మూకశ్మీర్లో జరుగనున్న జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ప్రాతినిథ్యం వహించనుంది. ఈ సందర్భంగా ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు క్రీడాకారిణిని అభినందించారు. వంశికను భవిష్యత్తులో భారత జాతీయ క్రికెట్ మహిళా జట్టులో చోటు దక్కించుకునే విధంగా సిద్ధమయ్యేందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. క్రికెట్ అకాడమీలో చేర్పిస్తామన్నారు. వంశీక పోటీలకు ఎంపికవ్వడం ముస్తాబాద్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, కొమ్మెటి రాజమల్లు, హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 10,000mAh బ్యాటరీతో వివో కొత్త 5G ఫోన్!