Fake Property Documents | నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేస్తున్న ముఠా అరెస్ట్

విదేశాల్లో నివసిస్తున్న వారి ఆస్తులను నకిలీ పత్రాలతో కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Property Documents | విదేశాల్లో నివసిస్తున్న వారి ఆస్తులను నకిలీ పత్రాలతో కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 1982 నాటి పత్రాలను కూడా సృష్టించి, నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జిపిఎ) పేపర్లను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Fake Property Documents | విదేశాల్లో ఉన్న వారి ఆస్తులు

అమెరికా (America)తో సహా విదేశాలలో నివసిస్తున్న వ్యక్తులకు చెందిన ఆస్తులను ఈ ముఠా సభ్యులు ముందుగా గుర్తిస్తారు. అనంతరం వివిధ రకాల సేల్​ డీడ్​లను ఉపయోగించి నకిలీ పత్రాలతో వాటిని కాజేస్తున్నారు. పోలీసు ఎల్‌బీ నగర్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న వారి నుంచి స్టాంపు పేపర్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలను ఉపయోగించి తనఖా పెట్టిన ఆస్తులను సైతం వీరు విడుదల చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి మాట్లాడుతూ అక్రమ ఆస్తుల లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : Dasara Special Buses | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. దసరాకు 7 వేల స్పెషల్​ బస్సులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *