Madnoor Theft Case | చోరీలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్

మద్నూర్​లో ఇటీవల వరుస చోరీలకు పాల్పడుతున్న ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Madnoor Theft Case | మద్నూర్​లో (Madnoor) ఇటీవల వరుస చోరీలకు పాల్పడుతున్న ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బిచ్కుంద సీఐ రవికుమార్ వివరాలు వెల్లడించారు.

Madnoor Theft Case | మద్నూర్​ గ్రామంలో..

ఈనెల తేదీ 4న రాత్రి మద్నూర్ గ్రామంలో ఓ ఇంట్లో, మేనూర్ గ్రామంలోని మూడు ఇళ్లలో దుండగులు చొరబడి బంగారం, వెండి, నగదును అపహరించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన వారిని మహారాష్ట్ర బస్మత్ ప్రాంతానికి చెందిన గుండెవర్ కరణ్, శైలేష్ బాలు పవర్ అలియాస్​ బాబా, రాహుల్ ఎల్లప్పగా గుర్తించారు.

మరోసారి చోరీ చేసేందుకు మద్నూర్ వైపు వస్తున్న గుండెవర్ కరణ్, శివ ఎల్లప్పలను బుధవారం మద్నూర్ శివారులోని మిర్జాపూర్ హనుమాన్ ఆలయం వద్ద పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు గతంలో చోరీ చేసిన బంగారం, వెండిని మహారాష్ట్రకు చెందిన మంగేష్, నౌషాద్, రైస్ అనే వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 10 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.1,100 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *