అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. మాక్లూర్ మండలం దాస్‌నగర్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌ను సందర్శించి అక్కడ టేబుల్ టెన్నిస్ పోటీలకు వసతులను పరిశీలించారు.
Khelo India Youth Games | టేబుల్ టెన్నిక్కు నిజామాబాద్ వేదిక..
జాతీయ స్థాయిలో మొత్తం 20 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా.. టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నిజామాబాద్ జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 150 మంది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు రానున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేయడం ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.
Khelo India Youth Games | ఐదురోజుల పాటు పోటీలు
దాదాపు ఐదు రోజుల పాటు పోటీలు కొనసాగనున్నందున క్రీడాకారుల వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు తదితర సదుపాయాలను సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయస్థాయి క్రీడా పోటీలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం ద్వారా నిజామాబాద్ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని, ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, నిజామాబాద్ ఆర్దీవో రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్ఛార్జీ డీఈవో సాయాగౌడ్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పవన్ కుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్, నవ్య భారతి స్కూల్ కరస్పాండెంట్ సంతోష్, లత పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Madhav Nagar ROB Protest | ఆర్వోబీ కోసం భిక్షాటన చేసిన ఎంపీ అర్వింద్