Kaldurki bus protest | బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు..

కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేవని నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్ : Kaldurki bus protest | కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేవని నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ ఘటన బోధన్ ​(Bodhan) మండలం కల్దుర్కి గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

Kaldurki bus protest | బోధన్​ మండలం కల్దుర్కిలో..

బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి సరిపడా బస్సులు నడపడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల విద్యార్థులు సోమవారం వచ్చిన బస్సును ఆపి దాని ఎదుట ధర్నా చేశారు. సరిపడా బస్సులు రాకపోవడంతో నిత్యం కళాశాలలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని వారు వాపోయారు. అదనపు బస్సులు కేటాయించాలని ఎన్నిసార్లు బోధన్ డిపో మేనేజర్​ను కలసి వినతిపత్రం అందించినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ స్పందించి అదనపు బస్సులు కేటాయించకపోతే గ్రామంలోనికి ఆర్టీసీ బస్సులు రానివ్వమని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Ayyappa Irumudi | రవితేజ ఇరుముడి..అసలు అయ్యప్ప భక్తుల ఇరుముడి వెనుక ఇంత మహత్యమా!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *