అక్షరటుడే, వెబ్డెస్క్: Owaisi Comments | న్యూయార్క్ పర్యటనలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోహన్ భగవత్ మాటలు ఆర్ఎస్ఎస్ అనుసరించే పాత వ్యూహంలో భాగమే అన్నారు.
న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇటీవల మాట్లాడుతూ.. ముస్లింలు భారత్లో ఉండొద్దు అనుకునేవారు అసలు హిందువులే కాదన్నారు. హిందూ రాష్ట్రం అంటే ముస్లింలు లేని దేశం కాదని వ్యాఖ్యానించారు. తాజాగా వీటిపై ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. బయటి ప్రపంచం కోసం ఆర్ఎస్ఎస్ నాయకులు చేసే ప్రసంగాలకు, తమ సొంత సభ్యుల కోసం చేసే ప్రసంగాలకు మధ్య తేడా ఉంటుందని ఆరోపించారు. దేశంలో UCC (ఉమ్మడి పౌర స్మృతి) ముసుగులో హిందూ చట్టాన్ని రుద్దుతున్నారని పేర్కొన్నారు. ఇది కూడా ఆర్ఎస్ఎస్ భావజాలమే అన్నారు. ఇదంతా జరుగుతుండగా.. మత సామరస్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.
Owaisi Comments | స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదని ఒవైసీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన హెడ్గేవార్ మొదట్లో కాంగ్రెస్లో ఉండేవారని గుర్తు చేశారు. అన్ని మత వర్గాలను ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని గాంధీ భావించడంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. దేశంలో క్రైస్తవులు తమ విశ్వాసం విషయంలో అణచివేతకు గురవుతున్నారని ఒవైసీ అన్నారు.
ఇది కూడా చదవండి..: Ankit Baliyan Murder Case | సింగర్ హత్య కేసు.. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు