అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ankit Baliyan Murder Case | హర్యానా (Haryna)కు చెందిన గాయకుడు, నటుడు అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. షామ్లీలో పోలీసులు, ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (UP Police) జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతమయ్యారు.
ఎస్పీ నరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. ఈ నెల 26న జిమ్ బయట అంకిత్ బలియాన్ హత్యకు గురయ్యారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ‘జట్టన్’ ప్రాంతంలో దుండగులు ఉన్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. తనిఖీ చేస్తున్నప్పుడు వారు పోలీసులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితులు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం గాయపడ్డట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, ఒక .32 బోర్ పిస్టల్, 26 లైవ్ కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
Ankit Baliyan Murder Case | గోగి గ్యాంగ్ పని..
సోనిపట్‌కు చెందిన భోలు సపురియా ఈ నేరానికి సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అతనే ఆయుధాలు, డబ్బు సమకూర్చాడన్నారు. ఇందులో ‘గోగి గ్యాంగ్’ ప్రమేయం ఉందన్నారు. ఆ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రస్తుతం జైలులో ఉన్నారని, అక్కడి నుంచే ఇలాంటి నేరాలు చేయిస్తున్నారని చెప్పారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.
Ankit Baliyan Murder Case | పూర్తిగా అంతం అయ్యే వరకు..
అంకిత్ బలియాన్ హత్య కేసులో ఇద్దరు ప్రధాన షూటర్లు ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయంపై అంకిత్ సోదరి రీనా స్పందించారు. దీనిపై తాము సంతృప్తిగా ఉన్నామన్నారు. కానీ తన సోదరుడిని చంపిన వారు పూర్తిగా అంతం అయ్యేంత వరకు, వారికి శిక్ష పడేంత వరకు నిజమైన సంతృప్తి లభించదన్నారు.
#WATCH | Uttar Pradesh | Two prime shooters in the Haryanvi singer and actor Ankit Baliyan murder case, shot dead in an encounter with state police and the Uttar Pradesh Special Task Force (UP STF), in Shamli
Visuals from the hospital, where the bodies have been taken pic.twitter.com/fKeU5u0Vka
— ANI (@ANI) August 31, 2026
దీనిని కూడా చదవండి : PRTU TG Nizamabad | పీఆర్‌టీయూ టీజీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అంబెల్లి శంకర్