MIM Leader Murder | ఓల్డ్​ సిటీలో ఎంఐఎం నేత హత్య

హైదరాబాద్ పాతబస్తీలో ఏఐఎంఐఎం నాయకుడు మెహబూబ్ అలీ హత్యకు గురయ్యాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MIM Leader Murder | హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో ఏఐఎంఐఎం నాయకుడు మెహబూబ్ అలీ హత్యకు గురయ్యాడు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గల వట్టేపల్లి ప్రాంతంలో గుంటల్ షా బాబా దర్గా సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

వట్టేపల్లిలోని గుంటల్ షా బాబా దర్గా సమీపంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో AIMIM ఏరియా అధ్యక్షుడు మెహబూబ్ అలీపై కొందరు దాడి చేశారు. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు అలీపై కత్తులతో దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

MIM Leader Murder | మూడు బృందాల ఏర్పాటు

ఈ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన పాతబస్తీలో ఆందోళన రేకెత్తించింది. అలీ హత్యతో కలిపి, ఈ ఏడాది ఇప్పటివరకు పాతబస్తీలో ఆరు హత్యలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ హత్యను MBT ప్రతినిధి అంజెద్ ఉల్లా ఖాన్ ఖండించారు. ఇది శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు.

ఇది కూడా చదవండి..: NEET PG Student Suicide | తీవ్ర విషాదం.. నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *