Nampally Court Fire | నాంపల్లి కోర్టులో అగ్ని ప్రమాదం

అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించడంతో మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. షార్ట్​సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nampally Court Fire | హైదరాబాద్​ మహా నగరంలోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడో అంతస్తులో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించారు.

IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం

Nampally Court Fire | షార్ట్​సర్క్యూట్​ వల్లనేనా..

రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించడంతో మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. షార్ట్​సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని, పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *