అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balka Suman Release | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి గురువారం విడుదలయ్యారు. సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలకు మార్గం సుగమమైంది.
Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!
Balka Suman Release | జైలు వద్ద స్వాగతం
కోర్టు విధించిన షరతుల మేరకు బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బాల్క సుమన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు.
సింగరేణి సంస్థకు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
అనంతరం బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదలయ్యారు.