RS Praveen Kumar | క్షుద్ర రాజకీయానికి తెరలేపిన కాంగ్రెస్​ : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారని బీఆర్​ఎస్​ ప్రధాన కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RS Praveen Kumar | క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారని బీఆర్​ఎస్ (BRS)​ ప్రధాన కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్ (Mahesh Goud)​ మాట్లాడుతూ.. హరీశ్​రావు క్షుద్ర పూజలు చేశారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ కౌంటర్​ ఇచ్చారు. హరీష్ రావుపై తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.

RS Praveen Kumar | నేను శివభక్తుడిని..

తాను శివ భక్తుడిని అని, మనోభావాలను కాంగ్రెస్​ నాయకులు దెబ్బతీశారని ప్రవీణ్​కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక, తాంత్రిక కుమార్‌లా మారారని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌ను గ్రహాచార భవన్‌గా మార్చారన్నారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు. హరీష్ రావు తనకు ఇష్టమైన దేవాలయాలకు వెళ్తారని, అది వ్యక్తిగతమైన అంశం అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ ఏ బ్రాండ్ తాగుతున్నారో తమకు తెలుసన్నారు. ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

RS Praveen Kumar | అద్దంకికి ​గుడుంబా ఎక్కువైంది

అద్దంకి దయాకర్‌కు గుడుంబా, అమెరికా (America) లిక్కర్ ఎక్కువ అయి మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనామక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ఇస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ 52 రోజులు దేశ ప్రజలకు తెలియకుండా రహస్య ప్రదేశానికి వెళ్లారని ప్రవీన్​కుమార్​ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

దీనిని కూడా చదవండి : Pregnancy Traditions| భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త జుట్టు, గడ్డం చేసుకోకూడదా? ఈ నియమం వెనుక ఆచారం ఏమిటంటే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *