అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS MLAs Suspension | శాసన సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు.
తమను పోలీసులు అడ్డుకోవడం, కేసులు నమోదు చేయడంపై బీఆర్ఎస్ సభ్యులు చర్చకు డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడే సమయంలో సైతం నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా వారు వినలేదు.
BRS MLAs Suspension | ఈ సెషన్ మొత్తం
సభ జరగనున్న ఈ సెషన్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభలో ఆందోళన నేపథ్యంలో గులాబీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఏకపక్షంగా ఆమోదించింది. అనంతరం వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
BRS MLAs Suspension | ఎస్సీలపై బీఆర్ఎస్ వివక్ష
సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీలపై బీఆర్ఎస్ విపక్ష చూపుతోందన్నారు. ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతంలో పసుపు నీళ్లతో శుద్ధి చేశారని ఆరోపించారు. ఈ సంఘటనపై కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుద్ధీకరణ పేరుతో చిల్లర రాజకీయం చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఎస్సీలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. చేతులు చూపించి బెదిరిస్తే భయపడటానికి ఎవరూ లేరన్నారు. మీ ఉడుత ఊపులు ఇక చెల్లవు.. ఎంతకాలం దాడులు చేసి బతుకుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: KTR | మా ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడుతున్నారు : కేటీఆర్