KTR | మా ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడుతున్నారు : కేటీఆర్​

తమ ఫొటోలను మార్ఫింగ్​ చేసి వాడుతున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | తమ ఫొటోలను మార్ఫింగ్​ చేసి వాడుతున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. అసెంబ్లీ ఎదుట జరిగిన గొడవలో డీప్​ ఫేక్​ వీడియోలు సర్క్యూలేట్​ చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ఎల్‌పీ కార్యాలయంలో బుధవారం ఉదయంం ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించంచారు. సభలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. అనంతరం కేటీఆర్​ మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్‌ (Cybercrime)లో ఫిర్యాదు చేస్తామన్నారు. నిన్న, మొన్నటి పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

KTR | బీఆర్​ఎస్​ నేతలపై మరో కేసు

బీఆర్ఎస్ నాయకులపై మరో కేసు నమోదు అయింది. అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనపై కేటీఆర్, హరీశ్ రావు, నవీన్ రెడ్డి, సుధీర్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. మహిళా పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీ-షర్టులు విప్పి మహిళా పోలీసుల ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి..: TTD Governing Body Meeting | రేపు తిరుమలలో TTD పాలకమండలి సమావేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *