RentoMojo IPO | ఐపీవోకు ఫర్నిచర్ అద్దె కంపెనీ..

ప్రముఖ ఆన్‌లైన్ ఫర్నిచర్, గృహోపకరణాల సబ్‌స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ అయిన ‘రెంటోమోజో’ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RentoMojo IPO | రెంటోమోజో అనేది టెక్నాలజీ ఆధారిత సంస్థ. ఇది ప్రజలు ఫర్నిచర్, గృహోపకరణాలను అద్దెకు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

దీని ఉత్పత్తి శ్రేణిలో ఫర్నిచర్, గృహోపకరణాలకు సంబంధించి 7,28,773 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పడకలు, సోఫాలు, వార్డ్‌రోబ్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, వాటర్ ప్యూరిఫయర్‌లు వంటివి ఉన్నాయి. ఇది హైయర్, వేక్‌ఫిట్, లివ్‌ప్యూర్ మరియు డ్యూరోఫ్లెక్స్ వంటి వివిధ బ్రాండ్‌ల ఉత్పత్తులను అందిస్తుంది.

RentoMojo IPO | అతిపెద్ద ఆన్‌లైన్ వేదిక..

సబ్‌స్క్రిప్షన్‌ల పరంగా రెంటోమోజో అతిపెద్ద ఆన్‌లైన్ అద్దె వేదికగా ఉంది. 2025 చివరి నాటికి ఈ సంస్థకు 22 నగరాల్లో 227,511 మంది చందాదారులున్నారు. ఈ సంస్థ తన ఉత్పత్తులను ఓమ్ని చానల్ ప్లాట్‌ఫాం ద్వారా, అలాగే 67 ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ల ద్వారా విక్రయిస్తోంది.

RentoMojo IPO | రూ. 1,256 కోట్ల ఐపీవో..

మార్కెట్ నుంచి రూ. 1,256 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవో (IPO)కు వచ్చింది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 1,106 కోట్లు సేకరించనుంది. ఐపీవో ద్వారా సేకరించిన నిధులలో రూ. 70 కోట్లు అప్పుల చెల్లింపునకు, రూ. 42.5 కోట్లు వేర్‌హౌస్‌లు, ఎక్స్‌పీరియన్స్ స్టోర్ల లీజుల చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

RentoMojo IPO | యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

ఐపీవో ప్రారంభానికి ఒక రోజు ముందే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రెంటోమోజో రూ. 376.07 కోట్లను సమీకరించింది. రూ. 404 ధరకు 41 మందికి 93.08 లక్షల షేర్లను కేటాయించారు. ఇందులో గోల్డ్‌మ్యాన్ శాక్స్, బ్లాక్‌రాక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, మిరాయి అసెట్, మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ సంస్థలున్నాయి.

ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 384 నుంచి రూ. 404గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 37 షేర్లున్నాయి.

కోటా : మొత్తం ఇష్యూలో 50 శాతాన్ని క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఙయర్స్ (క్యూఐబీ)కు, 15 శాతాన్ని నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ)కు, 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.

జీఎంపీ : గ్రే మార్కెట్‌లో రెంటోమోజో షేర్లకు డిమాండ్ ఉంది. ఒక్కో షేరు జీఎంపీ రూ. 135 ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి 33 శాతం లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి.

ఐపీవో తేదీలు : రెంటోమోజో కంపెనీ ఐపీవో సెప్టెంబర్ 9 (బుధవారం)న ప్రారంభమైంది. సెప్టెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 15న రాత్రి షేర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.

ఇది కూడా చదవండి..: Six IPOs | 30 ఏళ్ల రికార్డు బద్దలు.. ఒకేరోజు ఆరు ఐపీవోలు ఓపెన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *