బిజినెస్​Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతోంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 757 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్‌తో భారీ లాభాల దిశగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) .. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో వెనక్కి తగ్గింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో ప్రారంభమై 28 పాయింట్లు తగ్గింది.

అక్కడినుంచి తిరిగి పుంజకుని 681 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో ప్రారంభమై 2 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 229 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 757 పాయింట్ల లాభంతో 77,671 వద్ద, నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 24,233 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | ఐటీ, మీడియా రంగాలు మినహా..

దేశీయ స్టాక్ మార్కెట్ లో ఐటీ, మీడియా రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్ లు లాభాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty) రియాలిటీ ఇండెక్స్ 2.99 శాతం, ఆటో 1.56 శాతం, ఎఫ్ ఎంసీజీ 1.40 శాతం, యుటిలిటీ 1.37 శాతం, మెటల్ 1.37 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.28 శాతం, ఫార్మా 1.13 శాతం లాభాలతో ఉన్నాయి. ఐటీ 0.47 శాతం, మీడియా ఇండెక్స్ 0.37 శాతం నష్టాలతో సాగుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 స్టాక్స్ లాభాలతో, 6 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అదానీపోర్ట్స్ 5.04 శాతం, హెచ్యూఎల్ 4.42 శాతం, మారుతి 2.74 శాతం, ఎల్‌టీ 2.60 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.45 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : కొటక్ బ్యాంక్ 2.34 శాతం, ఎయిర్ టెల్ 1.37 శాతం, టీసీఎస్ 1.27 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, ఐటీసీ 0.41 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: May 04 Gold Rates | బంగారం ధర తగ్గుముఖం.. దేశంలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Agriculture College | వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లిలోనే ఏర్పాటు చేయాలి..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Agriculture College | వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లి...

India Election Shocks| సొంత నియోజకవర్గాల్లో వెనుకబడ్డ హేమాహేమీలు.. ముగ్గురు సీఎంలకు షాక్.

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Election Shocks| పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి...

Kavita Farmers Support | మొక్కజొన్న దగ్ధమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavita Farmers Support | ఆదిలాబాద్ జిల్లా...

X Money App | ‘ఎక్స్ మనీ’ వచ్చేస్తోంది..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : X Money App | ఎలాన్ మస్క్...