Indian Stock Market | ఫ్లాట్ గా దేశీయ స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు విషయమై ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు రేంజ్ బౌండ్ లో కొనసాగుతున్నాయి.

Indian Stock Market | లాభాల్లో ప్రారంభమై..

Indian Stock Market

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 428 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 164 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 652 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 79 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 216 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 74,842 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 23,558 వద్ద ఉన్నాయి.

Indian Stock Market | ఐటీ సెక్టార్‌లో దూకుడు..

ఐటీ సెక్టార్ దూకుడుమీదుంది. నిఫ్టీ (Nifty)లో ఐటీ సూచీ 3.48 శాతం, మీడియా 2.97 శాతం, టెలికాం 1.04 శాతం, రియాలిటీ 0.74 శాతం, ఫార్మా 0.59 శాతం లాభాలతో ఉండగా.. పవర్ 1.27 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.06 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.87 శాతం, యుటిలిటీ 0.74 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.

Indian Stock Market

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్స్ లాభాలతో, 16 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 4.61 శాతం, టెక్ మహీంద్రా 4.07 శాతం, టీసీఎస్ 3.10 శాతం, ఇండిగో 2.54 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.63 శాతం, లాభాలతో ఉన్నాయి.

Top Losers : కొటక్ బ్యాంక్ 1.22 శాతం, హెచ్యూఎల్ 1.21 శాతం, ఎన్టీపీసీ 1.02 శాతం, ఐటీసీ 0.89 శాతం, బీఈఎల్ 0.86 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Hexagon Nutrition IPO | ఐపీవోకు న్యూట్రిషన్ కంపెనీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *